: ఉద్దానంలో ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు జులై చివరికి పూర్తి చేయాలి: నారా లోకేశ్
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు జులై చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అమరావతిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, తాగునీటి కార్పొరేషన్ విధివిధానాలను వచ్చే మంత్రి వర్గ సమావేశంలోపు పూర్తి చేయాలని, తాగునీటి కార్పొరేషన్ కు, శాఖలకు మధ్య సమన్వయం అవసరమని, స్వచ్ఛ గ్రామాలకు పోటీ నిర్వహించి ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. వర్షాకాలంలో గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, ఉపాధి హామీ వేతనాలు త్వరితగతిన చెల్లించాలని ఆదేశించారు.