: ఇది శాంపుల్ మాత్రమే: రానా కొత్త సినిమా టీజర్‌పై హీరో నాని
తేజ దర్శకత్వంలో రానా నటిస్తోన్న కొత్త చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా టీజర్ ఈ రోజు విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ , మలయాళ భాషల్లో విడుదల చేయాలని ఆ సినిమా యూనిట్ భావిస్తోంది. ఈ రోజు రానా తాతయ్య రామానాయుడి జయంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్‌పై స్పందించిన నేచురల్ స్టార్ నాని ఇది శాంపుల్ మాత్రమేనని అన్నాడు. తాను థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా చూశానని, అదిరిపోయిందని పేర్కొన్నాడు. దగ్గుబాటి రానా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆ టీజర్‌ను నాని షేర్ చేశాడు.
Idhi sample ey .. Theatrical trailer nenu chusa .. Adhiripoyindhi :) https://t.co/IVnUStsKbx
— Nani (@NameisNani) June 6, 2017