: ప్రత్యేక హోదాను గాల్లో కలిపేశారు: వైసీపీ ఎమ్మెల్యే రోజా


ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని గాల్లో కలిపేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలకు రాయితీలు వస్తాయని, చాలా ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో టీడీపీ నేతలు పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ వల్ల లాభం చేకూరుతుందని టీడీపీ, బీజేపీ నేతలు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, ప్యాకేజ్ వల్ల ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలు, ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ వృద్ధి రేటు దేశంలోనే అగ్రస్థానంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్ మూడేళ్లుగా పోరాడుతున్నారని రోజా అన్నారు.

  • Loading...

More Telugu News