: విజిటింగ్ టైమ్ ముగిసిన తర్వాత, నిబంధనలకు విరుద్ధంగా.. శశికళతో రహస్యంగా భేటీ అయిన విజయశాంతి!


అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో జైలు శిక్షను అనుభవిస్తున్న శశికళను ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి రహస్యంగా కలుసుకున్నారు. చిన్నమ్మను బెయిల్ పై విడుదల అయిన దినకరన్ కలిసి బయటకు వచ్చిన తర్వాత సాయంత్రం 7 గంటల సమయంలో ఆమె జైల్లోకి వెళ్లారు. నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరినీ జైల్లోకి అనుమతించరు. ఏదేమైనప్పటికీ చిన్నమ్మతో విజయశాంతి భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

శశికళ జైల్లో, దినకరన్ బెయిల్ పై ఉన్న సమయంలో... పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు పార్టీని తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నమ్మను విజయశాంతి కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

  • Loading...

More Telugu News