: అమెరికాలో కాల్పులకు తెగబడ్డ దుండగుడు...పలువురి మృతి
అమెరికాలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడిన సంఘటనలో పలువురు మృతి చెందారు. ఫ్లోరిడా స్టేట్ లోని ఓర్లాండోలో ఈ రోజు ఈ ఘటన జరిగినట్టు ఆరెంట్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. బిజినెస్ హెడ్ క్వార్టర్స్ లోని ఉద్యోగులపైకి తుపాకీతో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అయితే, ఎంత మంది మృతి చెందారనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తాము భావించడం లేదని అధికారులు అన్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుడి సహా ఐదుగురు మృతి చెందినట్లు సీఎన్ఎస్ తన కథనంలో పేర్కొంది.