: ఇలాగైతే భారత్ చేతిలో ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాం : ఇమ్రాన్ ఖాన్ ఆవేదన


ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో పాక్ ఘోరంగా ఓడిపోవడం తనను చాలా బాధించిందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఆటగాడిగా ఆటలో గెలుపు, ఓటములు సహజమనే విషయం తనకు తెలుసని... కానీ, ఎలాంటి పోరాటం లేకుండానే చేతులెత్తేయడం తనను కలచి వేసిందని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. పాక్ క్రికెట్ వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే... టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య తేడా పెరుగుతూనే ఉంటుందని చెప్పారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే... ఇప్పుడు చూసినటువంటి పరాజయాలను చూస్తూనే ఉంటామని అన్నారు. పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ను ప్రొఫెషనల్ మెరిట్ ఆధారంగా నియమించనంత కాలం... ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయలేమని చెప్పారు.

  • Loading...

More Telugu News