: శ్రీశైలంలో ఉచిత దర్శనాలకు నూతన పద్ధతి
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఉచిత దర్శనాలకు నూతన పద్ధతిని దేవస్థానం ప్రవేశపెట్టింది. ఉచిత దర్శనం చేసుకునే భక్తులకు ఫొటో మెట్రిక్ యాక్సెస్ కార్డులు జారీ చేయనున్నారు. కార్డుల్లో కేటాయించిన సమయాన్ని అనుసరించి భక్తులకు దర్శనం లభిస్తుందని దేవస్థానం అధికారులు తెలిపారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు ఇకపై వేచి ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు.