: వంటగదిలోకి జొరబడిన చిరుత పిల్ల.. పిల్లి అనుకున్న మహిళ!
ఇంట్లోకి వచ్చిన ఓ చిరుత పులి పిల్లను చూసి దాన్ని పిల్లి అనుకొని భ్రమపడింది ఓ మహిళ. చివరకు అది గర్జించగానే భయపడిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఆ ఇంటికి వచ్చి చిరుత పిల్లను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో వాల్‌పారైలో ధనలక్ష్మి అనే మహిళ వంట చేసుకుంటోంది. అదే సమయంలో వంట గదిలోకి వచ్చేసిన చిరుత పిల్లను చూసి పిల్లి అనుకుని తన పని తాను చేసుకుంటూ పోయింది. కొద్ది సమయం తరువాత గర్జన వినపడడంతో బయటకు పరుగులు తీసి స్థానికులకు విషయం తెలిపింది. దాన్ని పట్టుకున్న అటవీశాఖ అధికారులు అది ఆరు నెలల వయసున్న మగ చిరుత పిల్ల అని చెప్పారు.