: సెల్ ఫోన్ జేబులో పెట్టుకున్నంత మాత్రాన గుండెపోటు రాదంటున్న కార్డియాలజిస్ట్!
మన దేశంలో ఎక్కువ మరణాలు గుండె జబ్బుల వల్ల సంభవిస్తున్నాయని ప్రముఖ కార్డియాలజిస్ట్ జె.శివకుమార్ తెలిపారు. ప్రతి ఏడాది హృద్రోగాల కారణంగానే దాదాపు 23 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన వెల్లడించారు. ప్రతి ఏటా దాదాపు 30 లక్షల మంది గుండె పోటుకు గురవుతున్నారని చెప్పారు. మూడు కోట్ల మంది కరోనరీ ఆర్టరీ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. నడక, పరుగు, వ్యాయామం, మితాహారం శ్రేయస్కరమని చెప్పారు. సెల్ ఫోన్లను జేబులో పెట్టుకోవడం వల్ల గుండె పోటు వస్తుందనేది కేవలం అపోహ మాత్రమేనని తెలిపారు.