: మన ఎంపీలు డుమ్మాల వీరులు.. రాహుల్ కంటే సోనియానే బెటర్!.. ఆ ఐదుగురు మాత్రం సూపర్!
కేవలం ఐదుగురు.. గడిచిన మూడేళ్లలో 545 మంది ఎంపీల్లో ఐదుగురు మాత్రమే లోక్‌సభకు వందశాతం హాజరుకాగా మిగతా వారంతా డుమ్మాల వీరులుగా మారిపోయారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే ఆ పార్టీ చీఫ్ సోనియా హాజరు శాతమే ఎక్కువ కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని బండా ఎంపీ అయిన భైరోన్ ప్రసాద్ మిశ్రా మొత్తం 1,468 చర్చల్లో పాల్గొని వందశాతం రికార్డుతో ముందువరుసలో నిలిచారు. 22 మంది ఎంపీలు సగం కంటే తక్కువ హాజరు నమోదు చేశారు. అయితే ప్రధాని మోదీ, ఆయన కేబినెట్ సహచరుల రికార్డులు మాత్రం లభ్యం కాలేదు. రాహుల్ గాంధీ 54 శాతం హాజరు నమోదు చేయగా సోనియా గాంధీ 59 శాతం హాజరుతో కుమారుడి కంటే ముందంజలో ఉండడం విశేషం. సోనియా గాంధీ ఐదు చర్చల్లో పాలు పంచుకోగా రాహుల్ 11 చర్చల్లో పాలుపంచుకున్నారు.
పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ బాడీ ప్రకారం.. 133 మంది ఎంపీలు 90 శాతం కంటే ఎక్కువ శాతం హాజరు నమోదు చేశారు. కాంగ్రెస్ సీనియర్లు వీరప్ప మొయిలీ, మల్లికార్జున ఖర్గేలు వరుసగా 91, 92 శాతం హాజరు పొందగా, యువనాయకులైన జ్యోతిరాదిత్య సింధియా, రాజీవ్ సతవ్లు లోక్‌సభకు 80 శాతం హాజరయ్యారు. ఇక వందశాతం హాజరైన మిగతా నలుగురిలో బీజేడీ ఎంపీ కుల్మని సమల్, బీజేపీ ఎంపీ గోపాల్ షెట్టి, కిరిట్ సోలంకి, రమేశ్ చందర్ కౌశిక్‌లు ఉన్నారు. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ 79 శాతం హాజరు నమోదు చేయగా ఆయన కోడలు, అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ 35 శాతం హాజరు నమోదు చేశారు. ఇక ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి, 2016 డిసెంబరు వరకు అమృత్‌సర్‌కు ప్రాతినిధ్యం వహించిన అమరిందర్ సింగ్ కేవలం ఆరు శాతం హాజరు నమోదు చేయడం గమనార్హం. ఇలా మొత్తం 545 మంది ఎంపీల్లో ఆ ఐదుగురు తప్ప మిగతా వారిలో సీనియర్లు, జూనియర్లు అందరూ ఏదో మొక్కుబడిగా లోక్‌సభకు హాజరవుతున్నట్టు తేలింది.