: అలా జరిగితే, బీజేపీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది: టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల


ఒకవేళ ఏపీలో కాంగ్రెస్ పార్టీ సభ విజయవంతమైనా, ఆ పార్టీ బలపడినా అందుకు బీజేపీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాహుల్ పర్యటనను నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు గుంటూరులో ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మోదుగుల మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇంతటితో వదిలేసేది కాదని, ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని అన్నారు. ప్రత్యేక హోదా విషయమై  ప్రధాని మోదీ చొరవ చూపాలని అన్నారు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజ్ కు అధికార టీడీపీ అంగీకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే పార్టీకి చెందిన మోదుగుల తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News