: ఛాంపియన్స్ ట్రోఫీ.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్


ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బర్మింగ్ హామ్ వేదికగా భారత్-పాక్ మధ్య జరగనున్న మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ ట్రోఫీలో తమ సత్తా చాటుకునేందుకు రెండు జట్లు సిద్ధమయ్యాయి. బర్మింగ్ హామ్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని స్పోర్ట్స్ ఎనలిస్ట్ లు చెబుతున్నారు. కాగా,  ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ ఇంత వరకూ మూడుసార్లు తలపడగా, పాక్ రెండు సార్లు, భారత్ ఒకసారి విజయం సాధించాయి. 

  • Loading...

More Telugu News