: ఈ నెల 18, 19 తేదీల్లో హైదరాబాద్ లో రాష్ట్రపతి పర్యటన
ఈ నెల 18, 19 తేదీల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ లో బస చేయనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో బస చేయడానికి వస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రణబ్ ‘ఎట్ హోం’ ఆతిథ్యమివ్వనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్, తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు, రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు తదితరులు హాజరుకానున్నారు.