: కేజ్రీవాల్ ప్రభుత్వంపై రెఫరెండం.. సీఎం నియోజకవర్గం నుంచే మొదలు.. కపిల్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
ఆమ్ ఆద్మీ బహిష్కృత నేత కపిల్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వంపై రెఫరెండం నిర్వహించనున్నట్టు తెలిపారు. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం)ను కేజ్రీవాల్ నియోజకవర్గం నుంచే మొదలుపెట్టనున్నట్టు తెలిపారు. కేజ్రీవాల్, అతడి కేబినెట్ సహచరుడు సత్యేంద్ర జైన్ అవినీతిపై ఆధారాలను మీడియాకు విడుదల చేస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
అయితే రిఫరెండం ఎప్పుడు నిర్వహించేది పేర్కొనలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిని అంతమొందించే వరకు తన పోరాటం ఆగదని మిశ్రా తేల్చిచెప్పారు. దీనిని అవినీతిపై ప్రజాయుద్ధంగా అభివర్ణించిన ఆయన తనకు మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. మంగళవారం కేజ్రీవాల్ ఇంటి ఎదుట నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.