: టీన్స్ కోసం యాప్‌ను సిద్ధం చేసిన ఫేస్‌బుక్.. ఇక తల్లిదండ్రులకు బేఫికర్!
ఆన్‌లైన్‌లో అనవసర స్నేహాలతో మోసపోతున్న, దోపిడీకి గురవుతున్న టీనేజర్ల కోసం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సరికొత్త యాప్‌తో ముందుకొస్తోంది. ఈ యాప్ ద్వారా పిల్లలపై తల్లిదండ్రులకు నియంత్రణ ఉంటుంది. వారు ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నారన్న విషయాన్ని తల్లిదండ్రులు గమనించే వీలుంటుంది. ‘టాక్’ పేరుతో పిలిచే ఈ యాప్ కేవలం టీనేజర్లకు మాత్రమే. ఇందులోకి తెలియనివారు ప్రవేశించడం, స్నేహాలు చేయడం లాంటి వాటివి ఉండవు. ఫేస్‌బుక్ మెసేంజర్ యాప్‌లో భాగంగా సంస్థ దీనిని విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. టాక్ అనేది మెసేజింగ్ యాప్ అని, దీనిపై పిల్లల తల్లిదండ్రులకు కూడా నియంత్రణ ఉంటుందని, వారిపై నిత్యం ఓ కన్నేసి ఉంచేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దినట్టు సమాచారం. ఇది కేవలం 13 ఏళ్ల వయసు వారికి మాత్రమేనని తెలుస్తోంది.