: మరోసారి కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్!
సరిహద్దు ప్రాంతాల్లో పదే పదే కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్‌కు బుద్ధి చెబుతూ ఇటీవలే పాక్ స్థావరాలపై భారత్ ఆర్మీ దాడి చేసిన విషయం తెలిసిందే. పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడడంతో నిన్న కూడా ఐదుగురిని భారత ఆర్మీ హతమార్చింది. అయినప్పటికీ పాకిస్థాన్‌కు బుద్ధి రావడం లేదు. ఈ రోజు పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీంతో భారత ఆర్మీ కూడా దీటైన జవాబు ఇస్తోంది. పూంచ్, రాజౌరి సెక్టార్లో ప్రస్తుతం ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురు కాల్పుల్లో ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి.