: మిత్రపక్షంగా ఉన్నంత మాత్రాన.. సొంత పార్టీని బలోపేతం చేసుకోవద్దా?: పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ లో జరిగే అభివృద్ధిలో సింహభాగం బీజేపీదే అని ఆ పార్టీ నాయకురాలు పురందేశ్వరి అన్నారు. ఏపీకి కేంద్రం లక్ష 75వేల కోట్ల నిధులను ఇచ్చిందని... ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలుగా తమపై ఉందని ఆమె చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పనిలో కేంద్రం ఇస్తున్న నిధులు ఉన్నాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పొత్తు గురించి పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని... పార్టీని బలోపేతం చేసే బాధ్యత తమపై ఉందని చెప్పారు. టీడీపీతో మిత్రపక్షంగా ఉన్నంత మాత్రాన... సొంత పార్టీని బలోపేతం చేసుకోకుండా ఉండాలా అని ప్రశ్నించారు.