: ప్రభాస్ లుక్‌లో ఎన్నో మార్పులు.. బరువు కూడా తగ్గాడు.. మీరూ చూడండి!
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి పార్ట్ 1, 2 సినిమాల కోసం బరువును పెంచేసి, హెయిర్‌స్టైల్ కూడా మార్చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘సాహో’ షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. అందుకోసం ఆయన బరువు కూడా తగ్గాడు. హెయిర్ స్టైల్ కూడా మార్చేశాడు. తాజాగా ఆయన.. కేశాలంకరణ నిపుణుడు ఆలిమ్ హకిమ్‌ను కలిశాడు. ఈ సందర్భంగా ఆలిమ్.. ప్రభాస్‌తో ఓ ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాహుబలి తరువాత ప్రభాస్ కనిపిస్తోన్న ఈ కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘సాహో’లో ప్రభాస్ లుక్ ఇదే అంటూ ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ సాహో చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోన్న విషయం తెలిసిందే.
#Prabhas Latest Stylish Look