: ఛాంపియన్స్ ట్రోఫీ అప్ డేట్స్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక
ఇంగ్లండ్‌లో కొనసాగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రోజు శ్రీలంక-దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లు తలపడనున్నాయి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐసీసీ వన్డేల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న సౌతాఫ్రికాపై గెలవాలంటే శ్రీలంక చెమటోడ్చాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య రేపు మ్యాచ్ జరగనుంది. టీమిండియా అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.