: 'సన్నీలియోన్' పేరుతో షార్ట్ ఫిలిం విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ!


సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సన్నీలియోన్ పేరుతో ఓ షార్ట్ ఫిలింను రిలీజ్ చేశారు. ఈ ఫిలింకు 'మేరీ బేటీ సన్నీ లియోన్ బన్నా చాహ్తి హై' అనే పేరు పెట్టారు. తన మొదటి షార్ట్ ఫిలిం ఇదేనంటూ సోషల్ మీడియా ద్వారా వర్మ వెల్లడించాడు. షార్ట్ ఫిలిం కథాంశంలోకి వెళ్తే... సన్నీలియోన్ లా కావాలనుకుంటున్న ఓ యువతిని ఆమె తల్లిదండ్రులు వారిస్తారు. అయితే, తాను సన్నీలియోన్ లా ఎందుకు కావాలనుకుంటోందో ఆమె వారికి వివరిస్తుంది. పోర్న్ స్టార్ కావడం కూడా ఓ వృత్తే అనే విధంగా ఆమె చెబుతుంది. తమ వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛ అమ్మాయిలకు ఇవ్వాలని చెప్పే ప్రయత్నాన్ని ఈ షార్ట్ ఫిలిం ద్వారా వర్మ చేశాడని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News