: బ్రిటన్‌లో భారతీయుడిని కొట్టి చంపిన వ్యక్తిని పట్టిస్తే భారీ నజరానా.. ప్రకటించిన పోలీసులు
బ్రిటన్‌లో భారత సంతతి వ్యక్తి ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టిచంపారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు 10 వేల పౌండ్ల నజరానా ప్రకటించారు. లండన్ నైరుతి ప్రాంతమైన హేయెస్‌లో స్నేహితుడితో కలిసి నడుస్తున్న సత్నామ్ సింగ్ (45)పై కారులో వచ్చిన ఆగంతుకుడు బ్యాట్‌తో దాడిచేశాడు. మార్చి 6న ఈ ఘటన జరగ్గా తీవ్ర గాయాలపాలైన సత్నామ్ సింగ్ చికిత్స పొందుతూ మే 23న మృతి చెందాడు. కాగా, నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 10 వేల పౌండ్లు (12,870 డాలర్లు) బహుమతి ఇవ్వనున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఇది జాత్యహంకార హత్య కాదని పోలీసులు చెబుతున్నారు. హత్యకు గల కారణాల గురించి దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు.