: ప్రపంచంలో అతి పే...ద్ద విమానాన్ని తయారు చేయిస్తున్న మైక్రో సాఫ్ట్ సహవ్యవస్థాపకుడు
ప్రపంచంలోనే అతి పెద్ద విమానాన్ని మెక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకుడు పాల్ అలెన్ తయారు చేయిస్తున్నారు. కాలిఫోర్నియాలోని వియానయాన సంస్థ తయారు చేస్తున్న ఈ విమానానికి రాకెట్లను ప్రయోగించగల సామర్ధ్యం ఉంటుంది. 50 అడుగుల ఎత్తుండే ఈ విమానం రెక్కలు 385 అడుగుల పొడవు వుంటాయి. దీని బరువు 5,00,000 పౌండ్లు (2,50,000 కేజీలు) ఉంటుందని తెలుస్తోంది. అలాగే 28 చక్రాలతో ఈ విమానం ఉంటుందని, రెండు అతిపెద్ద బోయింగ్ విమానాలను కలిపి దీనిని తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్ లో అంతరిక్ష ప్రయోగ వ్యాపారం భేషుగ్గా ఉంటుందని, అందులో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు దీనిని తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. చిన్న తరహా రాకెట్ల ప్రయోగాలు నిర్వహించేందుకు వీలుగా ఈ విమానాన్ని తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది.