: హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ... బేగంపేట విమానాశ్రయం వద్ద కోలాహలం


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాహుల్ కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేణుకా చౌదరి, షబ్బీర్ అలీ, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. రాహుల్ రాక సందర్భంగా విమానాశ్రయం వద్దకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. యువ నేతకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన సంగారెడ్డికి బయలుదేరారు. ఈ సాయంత్రం సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే పోరు గర్జన సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. దాదాపు రెండు లక్షల మందిని ఈ సభకు తరలిస్తున్నట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News