: సుష్మా మేడమ్.. నా బిడ్డకు సాయం చేయండి: ఓ పాకిస్థానీ అభ్యర్థన
తన దృష్టికి వచ్చిన భారతీయుల సమస్యలకు పరిష్కారం చూపుతూ, వారి కళ్లల్లో ఆనందం నింపుతున్న కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఈ సారి ఓ పాకిస్థానీ నుంచి ఓ అభ్యర్థన వచ్చింది. లాహోర్ వాసి అయిన ఓ సివిల్ ఇంజినీర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సుష్మాస్వరాజ్‌ను సాయం చేయమని కోరాడు. తన నెలల పసికందు ఓ వ్యాధితో బాధపడుతోందని, భారత్‌లో చికిత్స చేయించడానికి వీసా వచ్చేలా సాయం చేయమని ఆయన విజ్ఞప్తి చేసుకున్నాడు. భారత్, పాక్ ఘర్షణల వల్ల తన బిడ్డ ఎందుకు బాధపడాలని సుష్మా స్వరాజ్‌ను అడిగాడు. ఆయనకు సుష్మ స్వరాజ్ సమాధానం ఇస్తూ.. అతడి బిడ్డకు ఎలాంటి కష్టం రాదని, ముందు పాక్‌లోని ఇండియన్ హైకమిషన్‌ను సంప్రదించాలని, అనంతరం మెడికల్ వీసా వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.
No. The child will not suffer. Pls contact Indian High Commission in Pakistan. We will give the medical visa. pic.twitter.com/4ADWkFV6Ht https://t.co/OLVO3OiYMB
— Sushma Swaraj (@SushmaSwaraj) 31 May 2017