: నౌషేరాలో పాక్ సైనికులపై విరుచుకుపడ్డ భారత సైన్యం!
జమ్మూ కాశ్మీర్, పూంఛ్ పరిధిలోని నౌషేరా సెక్టారులో ఏ విధమైన కవ్వింపులు లేకుండానే పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, కాల్పులకు దిగిన వేళ, భారత సైన్యం వారిపై విరుచుకుపడింది. నౌషేరాతో పాటు కృష్ణ ఘాటీ సెక్టారులోనూ ఈ ఉదయం నుంచి పాక్ కాల్పులకు దిగినట్టు తెలుస్తోంది. సరిహద్దుల్లోనే భారత చెక్ పోస్టులే లక్ష్యంగా తేలికపాటి మోర్టార్లు, ఆటోమేటిక్ ఆయుధాలతో పాక్ కాల్పులు సాగిస్తుండగా, భారత్ దీటుగా సమాధానం ఇస్తోందని, ఇంకా కాల్పులు సాగుతున్నాయని రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మనీష్ మెహతా వెల్లడించారు. కాగా, సోమవారం నాడు భారత జవాన్లు ఇద్దరు పాకిస్థానీ చొరబాటుదారులను హతమార్చిన తరువాత పరిస్థితి మరింత విషమంగా మారింది.