: పొల్లాచ్చిలో అనుష్కకు చేదు అనుభవం.. కారవాన్ ను సీజ్ చేసిన అధికారులు!
'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా సూపర్ హిట్టైన అనంతరం దేవసేన అనుష్క నటిస్తున్న సినిమా 'భాగమతి'... ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచ్చి సమీపంలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో పాల్గొన్న అనుష్క కోసం ఆ చిత్ర యూనిట్ కారవాన్ ను ఏర్పాటు చేసింది. అయితే అక్కడి రవాణా శాఖాధికారులు చేపట్టిన తనిఖీల్లో ఆ కారవాన్ కు సరైన అనుమతి పత్రాలు లేవని గుర్తించారు. దీంతో దానిని పొల్లాచ్చి రవాణా శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. కారవాన్ ను స్వాధీనం చేసుకున్నప్పుడు అనుష్క అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది.