: ఢిల్లీ అసెంబ్లీలో కలకలం.. కపిల్ మిశ్రాపై దాడి చేసిన ఆప్ ఎమ్మెల్యేలు
ఢిల్లీ అసెంబ్లీలో ఈ రోజు అలజడి చెలరేగింది. ఏకంగా శాసనసభలోనే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యే కపిల్ మిశ్రాపై దాడికి దిగారు. ఈ రోజు కపిల్ మిశ్రా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పలు అవినీతి ఆరోపణలు చేశారు. సీఎంతో పాటు ఆరోగ్య శాఖమంత్రి సత్యేంద్ర జైన్ అవినీతి వ్యవహారం అంటూ ఆయన ఏదో చెప్పబోయారు. దీంతో హైడ్రామా కొనసాగింది. వెంటనే లేచిన ఆప్ ఎమ్మెల్యేలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం కపిల్ మిశ్రాపై ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేశారు. దీంతో స్పీకర్.. కపిల్ మిశ్రాను అసెంబ్లీ హాల్ బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్‌కు సూచించారు. కపిల్ మిశ్రాను మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు. బయటకు వచ్చిన కపిల్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ కలిసి రూ.300 కోట్ల మెడిసిన్స్ స్కామ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.