: అధికారిక లాంఛనాలతో ముగిసిన దాసరి అంత్యక్రియలు


దర్శకదిగ్గజం దాసరి నారాయణరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ మండలం తోల్ కట్టలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ లో... ఆయన సతీమణి పద్మ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. దాసరి పెద్ద కుమారుడు ప్రభు తండ్రి చితికి నిప్పుపెట్టారు. ఈ అంత్యక్రియలకు భారీ ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ దగ్గరుండి అంత్యక్రియలను జరిపించారు.

  • Loading...

More Telugu News