: మా పార్టీలో చేరి జగన్‌ను సీఎం చేస్తానని ‘దాస‌రి’ ఇటీవలే చెప్పారు: వైసీపీ


దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి ప‌ట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, ఆర్కే రోజా, భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి సంతాపం తెలిపారు. అనంత‌రం వారు మీడియాతో మాట్లాడుతూ దాస‌రి ఎంతో మందికి ఓ దారిని చూపార‌ని అన్నారు. ఆయ‌న జీవితం త‌ర‌త‌రాల‌కు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని అన్నారు. దాస‌రి త‌మ పార్టీలో చేరి త‌మ అధినేత జగన్మోహన్‌రెడ్డిని సీఎం చేస్తానని ఇటీవలే చెప్పారని వారు వ్యాఖ్యానించారు. ఆయ‌న మృతితో సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఆయ‌న లేని లోటును ఎవ్వ‌రూ భ‌ర్తీ చేయ‌లేర‌ని అన్నారు.                   

  • Loading...

More Telugu News