: ఈ మాట ఎవరన్నా... వినపడేది దాసరి నారాయణరావే...ఆయన మరణించారనకండి: దర్శకుడు క్రిష్
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు మృతిపై యువదర్శకుడు క్రిష్ జాగర్లమూడి స్పందించారు. హిందీ సినిమా మణికర్ణిక పనుల్లో తలమునకలై ఉన్న క్రిష్... దాసరి మృతి చెందారనవద్దని అన్నారు. దర్శకుడే సినిమాకి కెప్టెన్ అని ఎవరన్నా... వినిపించేది దాసరి నారాయణరావు పేరేనని ఆయన స్పష్టం చేశారు. దాసరికి మరణం లేదని చెప్పారు. భూమి మీద సినిమా చనిపోయినప్పుడు ఆయన మృతి చెందారందామని అన్నారు. దాసరి తీసిన 151 సినిమాలు ఆయన ఇంకా బతికే ఉన్నారని చాటుతాయని చెప్పారు. సినిమా థియేటర్లలోనో, రీమేక్ లుగానో, టీవీల్లోనో, వార్తల్లోనో ఆయన నిత్యం జీవించే ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పూర్తి తెలుగులో ట్విట్టర్ లో ఒక మెసేజ్ ను పెట్టారు. ఈ ట్వీట్ ను మీరే చదవండి.
— Krish Jagarlamudi (@DirKrish) May 30, 2017