: పరారీలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి... హత్య కేసులో నిందితుడు కావడంతోనే..!
గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే, వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో పరారయ్యారు. ఆయనతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు నిందితులు కూడా పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీన వెల్దుర్తి మండలం కండ్లకుంటలో తాడిపర్తి పాపిరెడ్డి అనే తెలుగుదేశం స్థానిక నేతను వైకాపాకు చెందిన కొందరు కత్తులు, రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో పిన్నెల్లి హనుమరెడ్డి, వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డి, నారాయణరెడ్డిలు ప్రధాన నిందితులు కాగా, జెండా పెంట కృష్ణానది రేవు వద్ద నిందితుల్లో కొంతమంది ఉన్నారన్న సమాచారంతో మంగళవారం నాడు వారిని అరెస్ట్ చేసి, హత్యకు వినియోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో పలువురు వైకాపా నేతలపై కేసులు పెట్టారు. ఈ కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి సహా పలువురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని డీఎస్పీ కే నాగేశ్వరరావు వెల్లడించారు.