: ధైర్యాన్ని కోల్పోయాం...పులిలా ఉండేవారు: సత్తిబాబు


ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆకస్మిక మృతితో పెద్దదిక్కును కోల్పోయామని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. హైదరాబాదులోని దాసరి నివాసంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  సమస్య వస్తే ఆయన వద్దకు వచ్చేవారమని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన పులిలా అండగా ఉండేవారని ఆయన చెప్పారు. తమ సామాజిక వర్గం ఆయన మృతితో పెద్దదిక్కుని కోల్పోయిందని ఆయన చెప్పారు. ఆయనతో అనుబంధం చాలా విలువైనదని ఆయన తెలిపారు. సమస్య ఏదైనా ఆయన ధైర్యాన్నిచ్చేవారని, తామంతా ధైర్యాన్ని కోల్పోయామని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News