: సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా దాసరి ముందుండే వారు: వెంకటేష్


ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆకస్మిక మృతితో సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయిందని ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ తెలిపారు. హైదరాబాదులో దాసరి నారాయణరావు నివాసంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాసరి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా ఆయన ముందుండే వారని చెప్పారు. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం వెతికే వారని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమకు కష్టం వస్తే సాయం చేసేందుకు ఆయనను అంతా ఆశ్రయించేవారని ఆయన తెలిపారు. అలాంటి దాసరి లేరన్న వార్త సినీ పరిశ్రమకు అశనిపాతమని ఆయన పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News