: దాసరి గురించి అభిమానులకు తెలియని విషయాన్ని షేర్ చేసుకున్న సురేష్ బాబు!


ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తెలిపారు. దాసరి పార్థివదేహాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమలో దర్శకులకు స్టార్‌ డమ్ తీసుకొచ్చిన వ్యక్తి దర్శకరత్న దాసరి నారాయణరావు అని కొనియాడారు. ఒక దర్శకుడిగా దాసరి అన్నిరకాల సినిమాలు తీశారని అన్నారు. అంతేకాదు దాసరిలో ప్రత్యేకత ఏంటంటే... గతంలో సినిమాలు మూడు షిఫ్టుల్లో పని చేసేవని చెప్పారు. మూడు షిఫ్టుల్లో పని చేయడమే గొప్ప అయితే... దాసరి మాత్రం ఒకేరోజు నాలుగైదు సినిమాలకు దర్శకత్వం వహించేవారని ఆయన తెలిపారు. దాసరి అసమాన ప్రతిభావంతుడని ఆయన తెలిపారు. దాసరి తమ కుటుంబ స్నేహితుడని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News