: మొయినాబాద్ లోని దాసరి ఫాం హౌస్ లో అంత్యక్రియలు
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆకస్మిక మృతితో సినీ పరిశ్రమ మూగబోయింది. నేడు తెలుగు సినిమాలకు సంబంధించిన షూటింగ్ లన్నీ రద్దయ్యాయి. నేటి ఉదయం 10 గంటలకు దాసరి నారాయణరావు పార్థివదేహాన్ని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ కు తీసుకెళ్లనున్నారు. అక్కడ సుమారు రెండు గంటలపాటు అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు చేవెళ్ల సమీపంలో గల మొయినాబాద్ లోని దాసరి నారాయణరావు ఫాం హౌస్ లో ఆయన భార్య దాసరి పద్మ అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశం సమీపంలోనే ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించనున్నారు.