: కళామతల్లి ముద్దుబిడ్డ దాసరిని చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మరువదు: చిరంజీవి, బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్


దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి పట్ల సినీన‌టులు చిరంజీవి, బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. ప్రస్తుతం చైనాలో ఉన్న చిరంజీవి అక్కడి నుంచే సంతాప ప్రకటనను విడుదల చేస్తూ... ఇటీవ‌లే దాసరికి తాము అల్లు రామలింగయ్య అవార్డును అందించామ‌ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను దాసరితో చాలాసేపు మాట్లాడానని చెప్పారు. తెలుగు సినిమాకు దాస‌రి కొత్త‌దారి చూపించార‌ని బాల‌కృష్ణ అన్నారు. కళామతల్లి ముద్దుబిడ్డ దాసరిని చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మరువదని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. 

  • Loading...

More Telugu News