: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో రేపు సాయంత్రం దాసరి నారాయణరావు అంత్యక్రియలు


హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన దర్శకరత్న దాస‌రి నారాయ‌ణ రావు భౌతికకాయాన్ని మరికాసేపట్లో ఆసుపత్రి నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లనున్నారు. కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ... దాసరి నారాయణరావు చరిత్రలో నిలిచిపోయే చిత్రాలను అందించారని అన్నారు. ఆయన భౌతికకాయాన్ని మరో 15 నిమిషాల్లో ఆసుపత్రి నుంచి నేరుగా దాస‌రి ఇంటికి తరలిస్తామని చెప్పారు.

రేపు ఉదయం ఆయన అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని అక్కడే ఉంచి, సాయంత్రం నాలుగు గంటలకు చేవెళ్ల‌లోని ఆయన ఫాం హౌస్‌లో ద‌హ‌న‌సంస్కారాల కోసం తీసుకెళ్తామని చెప్పారు. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛ‌నాల‌తో చేయ‌మ‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. దాస‌రి నారాయ‌ణ‌రావు ఎంతో గొప్ప‌వ్య‌క్తి అని, చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ మిగిలిపోయే ఓ వ్య‌క్తి అని తలసాని వ్యాఖ్యానించారు.  

  • Loading...

More Telugu News