: ఒక మాటలో చెప్పాలంటే ఈ వార్త నాకు షాక్‌లాంటిది: ఏపీ సీఎం చంద్రబాబు
దర్శకరత్న దాసరి నారాయణ రావు మృతి చెందారన్న వార్త తనను షాక్‌కు గురి చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మరణించారన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. ‘ఒక మాటలో చెప్పాలంటే ఈ వార్త నాకు షాక్‌లాంటింది.. ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలుసుకొని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించాను. ఆ సమయంలో ఆయన నాతో ఎంతో బాగా మాట్లాడారు.
నా మ్యారేజ్ కంటే ముందు నుంచి దాసరి నాకు తెలుసు. దాసరి ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ. ఎంతో మంది నటులను పరిచయం చేశారు. ఎన్నో సినిమాలను ఎన్టీఆర్‌తో చేశారు. తెలుగు సినిమాకి ఎనలేని సేవలందించారు. ఎంతో కష్టపడే మనస్తత్వం ఆయనది. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. దాసరి నారాయణ రావు, పద్మ నన్ను ఓ కుటుంబ సభ్యుడిగా చూసేవారు. దాసరికి పట్టుదల ఎంతో ఎక్కువ. అటువంటి వ్యక్తి చనిపోవడం ఎంతో బాధగా ఉంది. ఆయన అభిమానులకి, కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని చంద్రబాబు అన్నారు.