: షాకింగ్ వీడియో.. కోపంతో మనిషి పై నుంచి కారుని నడిపాడు!


చైనాలో ఓ వ్య‌క్తి దారుణంగా ప్ర‌వ‌ర్తించాడు. త‌న కారును పార్కింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఓ వ్య‌క్తి త‌న‌కు అడ్డుచెబుతున్నాడ‌ని ఏకంగా అత‌డి పై నుంచే కారును నడిపించాడు. ఈ దృశ్యాలు అక్క‌డి సీసీ టీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. అదృష్ట‌వ‌శాత్తు ఆ వ్య‌క్తి గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. పూర్తి వివ‌రాలు చూస్తే.. చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోగల షెంజెన్‌లో ఓ పెద్ద షాపింగ్‌ మాల్‌ వద్ద గ్రౌండ్‌ ఫ్లోర్‌కు ఓ కారులో వచ్చిన వ్య‌క్తి, అక్క‌డ త‌న కారుని పార్కింగ్ చేయాల‌ని చూస్తున్నాడు. అయితే, కాసేపు ఆగాల‌ని ఓ వ్య‌క్తి అత‌డికి సూచించాడు. అయిన‌ప్ప‌టికీ విన‌కుండా కారును మెల్లిగా పోనిచ్చాడు కారులోని వ్యక్తి. దీంతో కారుముందున్న వ్య‌క్తికి కోపం వ‌చ్చి, కారు ముందే ప‌డుకున్నాడు. దీంతో కారులోని వ్య‌క్తి త‌న కారును ఆయ‌న మీదుగా తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.


  • Loading...

More Telugu News