: అమలాపురంలో సందడి చేసిన‌ ‘దంగల్’ సినిమా ద‌ర్శ‌కుడు!


ఆమిర్ ఖాన్ న‌టించిన ‘దంగ‌ల్’ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నితీష్ తివారీ ఈ రోజు కోనసీమలో సందడి చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న తెర‌కెక్కిస్తున్న ఓ షార్ట్‌ఫిలిం ఆంద్రప్రదేశ్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. కోన‌సీమ అందాల మ‌ధ్య కొన్ని సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ షార్ట్‌ఫిలిం తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోంద‌ని నితీష్ తివారి అన్నారు. ఈ నేప‌థ్యంలో ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కోన‌సీమ పచ్చదనం తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. ప్ర‌ముఖ‌ వ్యాపార వేత్త భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ షార్ట్‌ఫిలిం కోసం అక్క‌డ‌కు వ‌చ్చాన‌ని చెప్పారు.                 

  • Loading...

More Telugu News