: ఆ టీవీ షోకు హోస్ట్ గా ‘యంగ్ టైగర్’ ఎన్టీఆర్ పేరును సూచించింది ఆ అగ్రహీరోలే!
హిందీలో విశేష ఆదరణ పొందిన ‘బిగ్‌బాస్’ షోను సినీనటుడు కమల హాసన్ హోస్ట్‌గా తమిళంలోనూ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు తెలుగులో ఈ షోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారన్న వార్త బయటకు రావడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎన్టీఆర్ వాగ్ధాటి ఏంటో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకి పలు సందర్భాల్లో తెలిసింది. ఆడియో ఫంక్షన్లలో తాను మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎన్టీఆర్ మైకు చేతపట్టుకుని అదరగొట్టేస్తాడు.
అలాంటి ఎన్టీఆర్ ను ఈ టీవీ ప్రోగ్రామ్‌కు హోస్ట్ గా చేయించాలనే ఆలోచన ఎవరికి వచ్చిందో తెలుసా? ఇప్పటికే 'స్టార్ మా'లో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోతో ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునాలకి వచ్చింది. తెలుగులో బిగ్ బాస్ చేయాలనుకుంటున్న ఆ టీవీ యాజమాన్యానికి చిరు, నాగ్‌లు కలిసి ఎన్టీఆర్ పేరును సూచించారట. అద్భుతంగా మాట్లాడే ఆయనను అందుకే 'స్టార్ మా' హోస్ట్ గా పెట్టాలని నిర్ణయం తీసుకుంది.