: లక్నో కోర్టుకు హాజరైన అద్వానీ.. సమావేశమైన సీఎం యోగి

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ కురువృద్ధుడు అద్వానీ లక్నోలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతిలు కూడా కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతకు ముందే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అద్వానీని కలసి, ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

25 ఏళ్ల క్రితం 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగింది. ఈ పాతికేళ్ల కాలంలో అద్వానీ కోర్టు ముందు హాజరుకావడం ఇది రెండోసారి. అద్వానీ, జోషీ, ఉమాభారతిలపై అభియోగాలు మోపి, కేసు విచారణను ప్రారంభించాలంటూ సుప్రీంకోర్టు ఇటీవలే సీబీఐ కోర్టును ఆదేశించింది. అంతేకాదు, కోర్టు ముందు వీరు హాజరుకావాల్సిందేనని... హాజరుకాకుండా వీరికి మినహాయింపును ఇవ్వకూడదని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే వీరు ముగ్గురూ నేడు లక్నోలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

More Telugu News