: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన ఆమ్లా!
వన్డేల్లో అత్యంత వేగంగా 7 వేల పరుగులను పూర్తి చేసిన విరాట్ కోహ్లీ రికార్డును దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా అధిగమించాడు. విరాట్ కోహ్లీ 161 ఇన్నింగ్సులలో ఈ ఘనత సాధించగా, ఆమ్లా 150 ఇన్నింగ్స్ లలోనే దాటేయడం గమనార్హం. కాగా, గత రాత్రి ఇంగ్లండ్ తో జరిగిన మూడవ వన్డే పోరులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆమ్లా 54 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేసి రాణించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 153 పరుగులకే ఆలౌట్ అయింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి రెండు మ్యాచ్ లను ఇంగ్లండ్ నెగ్గి ఉండటంతో, ఈ నామమాత్రపు మ్యాచ్ లో గెలవడం ద్వారా దక్షిణాఫ్రికాకు ఊరట లభించింది.