: టీమిండియాను పాక్ ఓడిస్తుంది: యూనిస్ ఖాన్
ఇంగ్లండ్ లో జూన్ 1 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ తమ జట్లకు వెటరన్ లు మద్దతు పలుకుతున్నారు. తాజాగా రిటైర్మెంట్ తీసుకున్న పాకిస్థాన్ సీనియర్ ఆటగాడు యూనిస్ ఖాన్, ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ గురించి స్పందించాడు. జూన్ 4న ఇండియాతో జరిగే మ్యాచ్ లో పాక్ విజయం సాధిస్తుందని తెలిపాడు. పాక్ జట్టు భారత్ ను చాలా సార్లు ఓడించిందని తెలిపాడు. ప్రస్తుత పాక్ జట్టుకు టీమిండియాను ఓడించే సత్తా ఉందని అన్నాడు. ఇంగ్లండ్ పిచ్ లు బాగున్నాయని చెప్పాడు. 400 స్కోరును కూడా ఛేదించవచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే టీ20లు, వన్డేల్లో గెలవాలంటే ఫీల్డింగ్ లో అవకాశాలను ఒడిసిపట్టాలని చెప్పాడు. ఫీల్డింగ్ విభాగం మెరుగ్గా ఉంటే ఆ జట్టు విజయావకాశాలు మెరుగవుతాయని యూనిస్ ఖాన్ తెలిపాడు.