: మాజీ క్రికెటర్ తపన్ బెనర్జీ కన్నుమూత
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మాజీ క్రికెటర్ తపన్ బెనర్జీ(73) ఈ రోజు ఉదయం మృతి చెందారని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) తెలిపింది. ఆయన అనారోగ్య సమస్యలతో కొంత కాలంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, నిన్న రాత్రి కోమాలోకి వెళ్లారని చెప్పింది. కాన్పూర్ప్ లో జన్మించిన ఆయన.. పశ్చిమ బెంగాల్ తరపున మొత్తం 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడారని క్యాబ్ పేర్కొంది. బౌలర్ అయిన బెనర్జీ తన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో మొత్తం 47 వికెట్లు తీశారు. ఆయన మృతి పట్ల పలువురు క్రికెటర్లు సంతాపం ప్రకటించారు.