: నాకు నచ్చాలంటే ఆ అబ్బాయిలో ప్రధానంగా ఉండాల్సిన లక్షణం ఇదే: రకుల్ ప్రీత్ సింగ్


తన వ్యక్తిగత జీవితానికి, భ్రమరాంబ పాత్రకు ఎలాంటి పోలిక లేదని యువనటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. వ్యక్తిగతంగా తనకు చాలా కోరికలు ఉన్నాయని చెప్పింది. తన కోరికలు చూసి తన తల్లి, నీవి గొంతెమ్మ కోరికలు అంటుందని చెప్పింది. ఇప్పుడిప్పుడే తనకు కూడా అలాగే అనిపిస్తుందని తెలిపింది. తానింతవరకు ప్రేమలో పడలేదని చెప్పింది. తాను ప్రేమించే వ్యక్తికి ప్రధానంగా ఉండాల్సిన లక్షణం ఏంటంటే...అతను కచ్చితంగా ఆరు అడుగులకు మించి ఉండాలని చెప్పింది. తన ఎత్తు 5.8 అడుగులని చెప్పింది. పైగా తాను 4 అంగుళాల హైహీల్స్ వేస్తానని, అంతకు మించిన ఎత్తు తనకు కాబోయో వాడు ఉండాలని చెప్పింది. ఈ విషయంలోనే సుమారు 90 శాతం మంది ఫిల్టర్ అయిపోతారని తెలిపింది. తరువాత ఇతర క్వాలిటీస్ కూడా నచ్చాల్సి ఉంటుందని రకుల్ నవ్వుతూ చెప్పింది.

  • Loading...

More Telugu News