: రేవంత్ రెడ్డి ఆంధ్ర పార్టీ తొత్తు.. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే వ్యక్తి: తలసాని
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఆంధ్ర పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని... చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారని విమర్శించారు. మీడియా ముందు మాట్లాడుతూ ప్రజలను రేవంత్ రెడ్డి మభ్యపెడుతున్నారని... రానున్న ఎన్నికల్లో రేవంత్ నియోజకవర్గం కొడంగల్ లో గులాబీ జెండా ఎగురుతుందని చెప్పారు. గొర్రెల ఎంపికలో అవినీతి జరుగుతోందని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారని... గొర్రెలనే ఇంతవరకు కొనలేదని, అలాంటప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని మండిపడ్డారు. 3వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.