: ప్రపంచంలో ఎవరికీ లేని విలన్ లక్షణాలు చంద్రబాబుకు ఉన్నాయి: భూమన


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులాంటి నీచపు వ్యక్తిత్వం ఉన్నటువంటి విలన్ ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ సినిమాల్లో సైతం ఇంత దారుణమైన విలన్ ఉండరని అన్నారు. ఎవరికీ లేని విలన్ లక్షణాలు చంద్రబాబుకు ఉన్నాయని... ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, ఆ మహానేతను మానసిక క్షోభకు గురి చేశారని విమర్శించారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో ఎలుకల్లా చేరి, పందికొక్కుల్లా దోచుకుంటున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పటికీ ఆచరణలోకి రావని భూమన అన్నారు. ఎన్నికల హామీలపై ఆయన మాట తప్పుతున్నారని చెప్పారు. పారిశ్రామిక ఒప్పందాలపై సైతం ఆయన అబద్ధాలే చెబుతున్నారని తెలిపారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు, ఆశయాలకు చంద్రబాబు ఘోరీ కట్టారని అన్నారు. నీతులు చెబుతూ, వంచించడంలో బాబును మించినవారు ఎవరూ లేరని విమర్శించారు.

  • Loading...

More Telugu News