: ‘నాకూ కావాలి’ అంటూ ఏడుస్తున్న ఇమోజీలను పోస్ట్ చేసిన సమంత
ప్రముఖ న్యూస్ ఎడిటర్ లత శ్రీనివాసన్.. హీరోయిన్ సమంతకు ఓ పోస్ట్ షేర్ చేశారు. తనకు ట్విటర్‌లో షేర్ చేసిన ఆ పోస్ట్‌పై స్పందించిన హీరోయిన్ సమంత ‘నాకూ కావాలి’ అంటూ ఏడుస్తున్న ఇమోజీలను పోస్ట్ చేస్తోంది. ఇంతకీ లత శ్రీనివాసన్ షేర్ చేసిన పోస్ట్ లో ఏముందంటే.. ఓ యువతి యోగా చేస్తుంటే ఆమె పెంపుడు కుక్క కూడా అదే పనిచేస్తోంది. అంతేకాకుండా ఆమె యోగాసనాలు వేయడానికి ఆ కుక్క సహకరిస్తోంది కూడా. ఆ కుక్క చేస్తోన్న సాయం సమంతాకు బాగా నచ్చేసిందేమో.. ‘నాకూ కావాలి’ అంటూ ఇలా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ అభిమానులను బాగా అలరిస్తోంది.. సమంతకు ఆమె అభిమానులు రకరకాల సమాధానాలు ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు.
I want