: రజనీ రాజకీయ ప్రవేశం చారిత్రక అవసరం... జూలైలో పార్టీ గురించి ప్రకటిస్తారు: రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్
తమిళనాట రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్ క్లారిటీ ఇచ్చారు. బెంగళూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ, అవినీతిని అంతం చేయడానికే తన తమ్ముడు (రజనీకాంత్) రాజకీయాల్లోకి వస్తున్నాడని అన్నారు. తన తమ్ముడి రాజకీయ ప్రవేశం చారిత్రక అవసరం కూడా అని ఆయన పేర్కొన్నారు. పార్టీ పేరు, అజెండాలపై చర్చలు నడుస్తున్నాయని ఆయన చెప్పారు. జూలైలో రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సన్నిహితులు, అభిమానులతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు.